1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నాని అలా వినిపిస్తాడా?

IndiaGlitz [Monday, September 23, 2013]
Comments

ఏ క్షణాన పైసా సినిమా చేయడానికి నాని ముందడుగు వేశాడో గానీ అప్పటి నుంచి అతను ఆడియో వేడుకల్లో యాంకర్ గానో, ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్యనో తప్ప సినిమాల్లో కనిపించడం మానేశాడు. ఈగ అంత పెద్ద సక్సెస్ అయినా నాని ఆ సక్సెస్ ను క్యాష్ చేసుకోలేదు. గౌతమ్ మీనన్ సినిమా రావడం, పోవడం కూడా జరిగిపోయింది.

ప్రస్తుతం నాని సినిమాలన్నీ విడుదలకు వెయిటింగ్ లో ఉన్నవే. వాటి సంగతిని పక్కనపెడితే నాని ఈ మధ్య వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అదీ డి ఫర్ దోపిడి సినిమాకు. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ కథానాయకులుగా నటించిన చిత్రం డి ఫర్ దోపిడీ.తన స్నేహితుడు నటించిన సినిమా అనే  కారణంతోనే నాని ఈ సినిమాకు వాయిస్ ఇచ్చాడు.

పాత్రల పరిచయంలోనూ,   సన్నివేశాల నేపథ్యాన్ని వివరించాల్సివచ్చినప్పుడు నాని గొంతు వినిపిస్తుందట.  సిరాజ్ కల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ఆడియో జరుపుకోనుంది. అంటే యాంకర్ గానూ నాని మరో సారి కనిపిస్తాడా? అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
Sunil To Play Bhakta Kannappa

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sunil To Play 'Bhakta Kannappa'
 RP Patnaik's Hollywood Film 'Amy'
 'Break Up' Increasing the Number Of Theaters: Amar
 'Vethikaa Nenu Naa Ishtamgaa' Coming for Dasara
 Ramayya Vastavayya Audio Launch
 RGV Says Beauty Lies In The Minds Of The Beholder
 ఎవడు మార్పుల్లో అదొకటా?
 Suresh Kondetis Tenth Film
 The Good Road Selected As The Official Indian Entry For Oscars
 Madalasa To Debut In Kavita Barjatyas Detective thriller Samrat & Co
 Hrudaya Kaleyam Employing Foreign Technicians
 Potugadu US 2nd Week Schedules
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.