1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

తెలుగుతమిళ భాషలలో కార్తికేయ

IndiaGlitz [Thursday, September 26, 2013]
Comments

యువకదానాయకుడు నిఖిల్ తో తాము నిర్మిస్తున్న  'కార్తికేయ' చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలొ రూపొందుతోందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో జరుగుతోందని ఆయన అన్నారు. ఏవీయం స్టూడియో లో ఈ షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ హీరో జయం రవి, నిర్మాతలు ఎడిటర్  మోహన్, మాదేష్, సుభాష్ చంద్రబోస్ లు విచ్చేశారు. పాండిచ్చేరి, కుంభకోణం తదితర ప్రాంతాలలో చిత్రం షూటింగ్ జరుగుతుందని నిర్మాత తెలిపారు.

తొలిచిత్రమే ద్వి భాషా చిత్రంగా రూపొందిచటం ఎంతో  ఆనందంగా ఉందని ఆయన అన్నారు.  శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా  పరిచయం  అవుతున్నారు. కార్తికేయ ద్విభాషా చిత్రంగా రూపొందటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు హీరో నిఖిల్.

ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక  చిత్రం గా  దీనికి  రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు  చందు మొండేటి తెలిపారు.  చిత్ర నాయకా,నాయికలు వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో..ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు..ఒక వేళ  సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్న ది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర కధానాయకుడు 'నిఖిల్'ది .ఈ నేపధ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.

వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత తెలిపారు.కధానాయకుడు నిఖిల్ గత చిత్రాలకన్నా అధిక బడ్జెట్  లో రూపొందుతున్న ఈ చిత్రం విజయం పై ఎంతో  నమ్మకముందని నిర్మాత తెలిపారు
Dasari & Raghavendra Rao To Direct Manchu Lakshmi

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Dasari & Raghavendra Rao To Direct Manchu Lakshmi
 'First Love' Censor Completed
 'Masala' First Look
 Pirates Of 'Attarintiki Daredi' Arrested
 Oka Hindu Oka Muslim Completes First Schedule
 Sudhakar Komakula In a New Film
 Doosukeltha to hit screens on 11th October
 Daughter Of Varma Coming On 28th Sep
 Cinema Should Never Shy Away From Social Responsibility
 Attarintiki Daredi Woes Continue
 దూసుకెళ్తాలో మిస్సయింది
 PBS Puraskar To MS Vishwanathan and Vani Jayaram
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.