1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

క్రమంగా పెరుగుతున్న ట్రెండ్

IndiaGlitz [Monday, September 30, 2013]
Comments

ఒక్కో టైంలో ఒక్కో తరహా సినిమా టైటిల్ ట్రెండ్ నడుస్తోంది. ఓ టైంలో రా అనే అక్షరంతో టైటిల్స్ హవా నడిస్తే.. మరో టైంలో నువ్వు అనే పదంతో అలాంటి హవా నడిచింది. ఇప్పుడు అలా నడుస్తున్న ట్రెండ్ లో ఒకటిగా చెప్పుకోదగ్గది  గాడు అనే పదంతో కూడిన  టైటిల్స్.   టైటిల్ లో ఇలా గాడు అనే పదం ఉండడం పాత రోజుల్లోనే ఉంది.  'మాయదారి మల్లిగాడు', 'మోసగాడు', 'మహానగరంలో మాయగాడు', 'మిస్టర్ మాయగాడు', 'మొనగాళ్లకు మొనగాడు'.. ఇలా ఉండేవి అప్పట్లో టైటిల్ లు. అయితే ఇవేవి వరుసగా సందడి చేయలేదు.

అయితే.. ఈ మధ్య కాలంలో సంవత్సరానికి ఒకమారైనా ఇలాంటి టైటిల్ తరుచుగా వినిపిస్తోంది. 2011లో 'మాయగాడు' (వేణు, ఛార్మి), 2012లో  'మల్లిగాడు' (కార్తీ అనువాద చిత్రం).. 'సుడిగాడు' (అల్లరి నరేష్), 2013లో 'పోటుగాడు' (మంచు మనోజ్).. ఇలా సందడి చేస్తే 2014లో వీటికి కొనసాగింపుగా సుధీర్ బాబు సినిమా 'మాయదారి మల్లిగాడు' రానుంది. ఇప్పటికే 'సుడిగాడు', 'పోటుగాడు'లు విజయం సాధించిన వైనాన్ని 'మాయదారి మల్లిగాడు' కూడా కొనసాగిస్తే తెలుగులో గాడు ట్రెండ్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లే.
5న భాయ్ ఆడియోOther News


Malligadu Marriage Bureau Shooting Climax

Attarintiki Daredi DVDs seized in KPHB Hyderabad

Bhai Audio On 5th October

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.