Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

కేసు పెట్టిన నజ్రీయా...

IndiaGlitz [Sunday, October 06, 2013]
Comments

'నేరం' అనే చిన్న సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. ఆ సినిమా అందించిన విజయంతో అక్కడి ప్రముఖుల దృష్టిని తన వైపుకి మరలేలా చేసుకుంది కేరళ కుట్టి నజ్రీయా నసీమ్.. ఈ ముద్దుగుమ్మ నటించిన రెండో తమిళ చిత్రం 'రాజా రాణి' ఇటీవలే విడుదలై ఘనవిజయం దిశగా పయనిస్తోంది. ఇందులో ఆర్య, నయనతార, జై, సత్యరాజ్ వంటి నటులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ మూడో తమిళ చిత్రం 'నయాండి' (తెలుగు అర్థం.. వ్యంగ్యం) ఈ నెల 11న విజయదశమి కానుకగా విడుదల కానుంది. ఇందులో కొలవెరీ డి పేమ్ ధనుష్ హీరో.

ఈ సినిమాకి సంబంధించి ఓ వివాదం నెలకొంది తాజాగా. ఈ సినిమాలో ధనుష్ తో నజ్రీయాకి ఓ రొమాంటిక్ సాంగ్ ఉంది. ఆ పాటలో ఆమె నడుముపై ధనుష్ చేయివేసే సన్నివేశాన్ని నజ్రీయా అనుమతి లేకుండా బాడీ డబుల్ (నజ్రీయా డూప్) తో చిత్రీకరించారు.  ప్రచార చిత్రంలోనూ, స్టిల్స్ లోనూ.. ఆ దృశ్యాలను తిలకించాక నజ్రీయా అగ్గి మీద గుగ్గిలమై నడిగర్ సంఘంలో ఆ చిత్ర దర్శకనిర్మాతలపై  ఛీటింగ్ కేసుపెట్టిందట..  ప్రస్తుతం కోలీవుడ్ లో ఇది ఓ హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం సినిమాకి ప్లస్ గా మారుతోందో మైనస్ గా మారుతుందో చూడాలి.




త్వరలోనే త్రిష దర్శనం



Other NEws

త్వరలోనే త్రిష దర్శనం

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.