Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

శ్రీహరికి ఎక్కడ తగ్గాలో తెలుసు

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

శ్రీహరిని చూసిన వారు ఎవరూ కూడా హీరోగా చూడరు. మా శ్రీహరి అనే ఫీలింగ్ తోనే చూస్తారు. అన్నయ్యా అని ఆత్మీయంగా పిలుస్తారు. తమ్ముడు అని వాత్సల్యంతో పిలుస్తారు. బావా అని మురిపెంగా పిలుస్తారు. అందరి నాలుకల్లో మెదిలే సినిమా కళాకారుడు శ్రీహరి. నిత్యం అటు జూనియర్ ఆర్టిస్టులతోనూ, ఇటు నిర్మాతలతోనూ, రాజకీయ నాయకులతోనూ, ఆర్తనాదాలను వినిపించడానికి వచ్చిన వారితోనూ శ్రీహరి ఇల్లు నిండిపోయి కళకళలాడుతూ కనిపిస్తుంది.

వచ్చిన వారు కదిలితే కదా శ్రీహరి నిద్రపోవడానికి. ఆ ఇంట్లో అర్థరాత్రి దాటినా ముచ్చట్లు వినిపిస్తూనే ఉంటాయి. ఎంతో మందికి భరోసా ఏదో రూపంలో కలుగుతూనే ఉంటుంది. అభయహస్తం ఇవ్వడంలో శ్రీహరికి ఆయనే సాటి. ఎంతో మంది నిర్మాతలకు ఆయన సాయం చేస్తుంటారు. వర్ధమాన నటులకు తన వంతు సాయం చేస్తూనే ఉంటారు.

మర్యాదస్తుడు

శ్రీహరి గొప్ప మర్యాదస్తుడు. అత్తారింటికి దారేదిలో ఎమ్మెస్ క్లైమాక్స్ లోఓ మాట చెబుతాడు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి గొప్పవాడు అని. నిజంగా శ్రీహరికి ఎక్కడ తగ్గాలో తెలుసు. తనకు జీవితాన్నిచ్చిన గురువుగారు దాసరి నారాయణరావుగారంటే ఆయనకు అమితమైన భక్తి. ఒక్క ఫోన్ కాల్ అక్కడి నుంచి రాగానే చిన్న పిల్లాడిలా పరుగులు తీసేవాడు. గురువు రుణాన్ని అంతకన్నా గొప్పగా ఏ శిష్యుడు తీర్చుకోగలడు? జర్నలిస్టులు ఎక్కడ కనిపించినా నిలిచి నిదానంగా పలకరించనిదే వెళ్లేవాడు కాదు. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాడు అనడానికి అంతకన్నా నిదర్శనం ఏముంటుంది?




హీరో శ్రీహరి ఆకస్మిక మరణం



Related News

 Srihari's 'Real Star' to be released in July
 Sri Hari's last film 'Siva Keshav' To Be Released On 5th December
 Tollywood Reminisces The Real Star
 శ్రీహరి చివరి కోరిక
 శ్రీహరి లేక మూగపోయిన సినిమాలు
 శ్రీహరి మాటతీరు
 గురువారం శ్రీహరి అంత్యక్రియలు
 హీరో శ్రీహరి ఆకస్మిక మరణం...
 Sri Hari's Last Rituals Tomorrow
 Tollywood With The Sher Khan

Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.