1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రీహరి మాటతీరు

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

శ్రీహరి అనగానే ఎవరికి ఏం గుర్తుకొచ్చినా అందరికీ గుర్తొచ్చే ఏకైక విషయం ఆయన గొంతు. వినడానికి గంభీరంగా ఉంటుంది శ్రీహరి గొంతు. ఆయన శిల్పం ఎంత ఠీవీగా ఉంటుందో, గొంతు అంత దృఢంగా వినిపిస్తుంది. సినిమాల్లో వినిపించే మామూలు తెలుగు ఆయన గొంతుకు బాగా అలవాటే. డైలాగులను తనదైన శైలిలే చెప్పే శ్రీహరి ఇటీవల కాలంలో ఎక్కువగా తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నారు.

ఢీ నుంచి ఆయన తెలంగాణ యాసలో మాట్లాడటం ఎక్కువగా వినిపిస్తోంది. ఢీ, కింగ్, బృందావనం సినిమాల్లో శ్రీహరి తెలంగాణ యాస స్పష్టంగా తెలుస్తుంది. పుంగి పలుగుద్ది అని కింగ్ లో ఆయన చెప్పిన డైలాగుకు థియేటర్లో పడ్డ క్లాప్స్ను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు.

మగధీరలో షేర్ ఖాన్ గా భారీ డైలాగులను తన గంభీర స్వరంలో పలికించిన శ్రీహరి అదే సినిమాలో సాల్మన్ పాత్రలో ఒలె ఒలె ఒలె సిన్నోడా అంటూ శ్రీకాకుళం యాసను తన స్వరంలో ఇట్టే పలికించాడు. మాండలికాల్లో శ్రీహరికి పట్టు ఎక్కువ. ఆయన డబ్బింగ్ చెబుతుంటే అసిస్టెంట్ డైరక్టర్లు బాగా ఎంజాయ్ చేసేవారు.Other News


Sri Haris Last Rituals Tomorrow

Tollywood With The Sher Khan

Chiranjeevis Condolences For Sri Haris Demise

Sriharis Memorable Roles

Sri Haris Last Rituals Tomorrow

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sri Haris Last Rituals Tomorrow
 Tollywood With The Sher Khan
 Chiranjeevis Condolences For Sri Haris Demise
 Sriharis Memorable Roles
 Sher Khan Of Telugu Cinema No More
 Work On Stars Charisma : Harish Shankar [Interview]
 VV Vinayak Celebrates Birthday At Basara Temple
 Nazriya Nazims Complaint Against Using Body Double
 Not Into Politics Planning Adhurs2: VV Vinayak
 Tale Of Two Families Nuvve Naa Bangaram
 భాయ్ చుట్టూ ప్లస్ లే
 Band Baajaa To Release On 25th October
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.