1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మనోహరుడు వాయిదా పడిందట?

IndiaGlitz [Saturday, October 12, 2013]
Comments

కథానాయకుడు విక్రమ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో 'అపరిచితుడు' తరువాత రూపొందుతున్న సినిమా 'మనోహరుడు'. తమిళంలో 'ఐ' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు సురేష్ గోపీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ మధ్య వరకు సినిమా గురించి పెద్దగా వార్తలు రాలేదు. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా ఏదో ఒక రూపంలో వార్తల్లోకెక్కుతోంది.

కాస్త అటు,ఇటుగా నెల రోజుల క్రితం విక్రమ్ రూపంపై వార్తలు ప్రముఖంగా వస్తే. గత రెండు రోజులుగా లీకైన కథపై వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో విడుదలపై కోలీవుడ్లో  కొత్త కథనాలు పుట్టుకొస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా. తాజాగా వారి నిర్ణయాన్ని మార్చుకుని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి కొత్త పథకాలు రూపొందిస్తున్నారట. ఎప్పుడొచ్చేది ముఖ్యం కాదు ఎలా ఉందనేది ముఖ్యం అనే కేటగిరిలో చేర్చదగ్గ మనోహరుడుపై ఇరు భాషల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
NTRs Journey Of Failures With Hit Directors

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.