1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జులాయితో మరోసారి

IndiaGlitz [Saturday, October 19, 2013]
Comments

'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ తర్వాత సినిమా ఏం చేస్తాడోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకవైపు రామ్ చరణ్, మరోవైపు ఎన్టీఆర్ ఇద్దరూ త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే డి.వి.వి.దానయ్య మరోసారి త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంభినేషన్ లో  సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడట.

ఇంతకు ముందు వీరిద్దరి కాంభినేషన్లో విడుదలైన జులాయి కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించింది. అటు బన్ని, ఇటు త్రివిక్రమ్ కి మంచి బ్రేక్ నిచ్చింది. ఓకేలా అలోచించే ఇద్దరి వ్యక్తుల కథతో జులాయి రూపొందింది. ఇందులో అల్లు అర్జున్ ఎనర్జీని సరిగా వినియోగించుకుని పక్కా కమర్షియల్ సినిమాని రూపొందించిన త్రివిక్రమ్ ఈసారి సినిమా చేస్తాడంటారా!ఒకవేళ చేస్తే ఎలాంటి కథతో ముందుకు వస్తాడో , ఇవన్నీ పక్కన పెడితే ,దానయ్య ప్రయత్నం పలిస్తుందంటారా! మరి త్రివిక్రమ్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Prema Ishq Kadal Audio On 24th October

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.