1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మసాలాలో లోటులు బాగానే ఉన్నాయి

IndiaGlitz [Tuesday, October 22, 2013]
Comments

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరువాత వెంకటేష్ చేస్తున్న మల్టీస్టారర్ సినిమా 'మసాలా'. రామ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, షాజన్ పదంసీ హీరోయిన్లు కాగా.. విజయ భాస్కర్ దర్శకుడు. ఈ సినిమాని వచ్చే నెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతసారథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన పాటలు  ఇటీవలే విడుదలయ్యాయి.

వెంకీ-విజయభాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన గత రెండు చిత్రాలైన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలతో పోల్చిచూస్తే మసాలా పాటలు చాలా అంటే చాలా వీక్ గా ఉన్నాయని సింహభాగం విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. విడుదలైన ప్రచార చిత్రంలోనూ సంభాషణలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని కూడా వినిపిస్తోంది.

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిల విజయంలో మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగానే ప్రభావం చూపిస్తే.. మసాలాలో ఆయన వర్క్ చేయని లోటు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు సినీ విశ్లేషకులు.  ఏతావాతా మసాలాలో లోటులు బాగానే ఉన్నాయనుకోవచ్చు. పాటల పరంగా, సంభాషణల పరంగా సో..సో.. అనిపించుకున్న మసాలా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.




మసాలా డేట్ కన్ ఫర్మ్





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.