1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగడులో మహేష్ డ్యూయెల్ రోల్?

IndiaGlitz [Thursday, October 24, 2013]
Comments

'దూకుడు' వంటి సంచలన విజయం తరువాత కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం ఆగడు. తమన్నా హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

ఇదిలా ఉంటే. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయెల్ రోల్ పోషించనున్నారని ఓ వార్త వినిపిస్తోంది. గతంలో మహేష్ బాబు డ్యూయెల్ రోల్ చేసిన వైనమైతే 'నాని' విషయంలోనే జరిగింది. అందులో పతాక సన్నివేశాల కోసం మహేష్.. రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఆ సినిమా తరువాత డబుల్ రోల్ కి అంతగా ప్రాధాన్యతమివ్వని మహేష్.. ఇప్పుడు 'ఆగడు' కోసం అలా కనిపించేందుకు సిద్ధం కానున్నారట.

అయితే మహేష్ తండ్రీకొడుకులుగా అలా కనిపిస్తాడా? అన్నదమ్ములుగా అలా కనిపిస్తాడా? అనేది త్వరలోనే తెలియాల్సి ఉంది. ఇదివరకు శ్రీనువైట్ల. చిరంజీవి హీరోగా 'అందరివాడు' అనే డ్యూయెల్ రోల్స్ ఉన్న సినిమాని చేసిన సంగతి తెలిసిందే.Other News


కబాలిగా కార్తీ

Varna Audio On 27th October In A Gala Event

Pawan Trivikram CoProduction Kobali

Palnadu Will Surpass Pandem Kodi: Dasari

కబాలిగా కార్తీ

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.