Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గౌతమ్ మీనన్కి హీరోలు దొరికారు

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

'చెలి, ఘర్షణ, రాఘవన్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఏ మాయ చేసావె, ఎటో వెళ్లిపోయింది మనసు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్.   ఈ మధ్యకాలంలో తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించడానికి హీరో దొరక్క  ఈ దర్శకుడు నానాకష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.

సూర్యతో 'ధ్రువ నక్షత్రం' పేరుతో ఓ సినిమా తీయాలని గత కొన్ని నెలలుగా కలలు కంటున్న గౌతమ్ కి సదరు తమిళ కథానాయకుడు ఆ సినిమా చేయడం లేదంటూ షాకిచ్చిన సంగతి తెలిసిందే. లైన్ చెబితే సరిపోదు. పూర్తి స్క్రిప్ట్ ఉంటేనే సినిమా చేస్తా. లేదంటే లేదనన్నట్లుగా సూర్య చెప్పడంతో ఆ సినిమాకి బ్రేక్ పడింది. దాంతో గౌతమ్ కూడా చేసేదేమి లేక వేరే హీరోల వేటలో పడ్డారు.

గౌతమ్ కి ఉన్న ట్రాక్ దృష్ట్యా ఇద్దరు హీరోలు అతడు చెప్పిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వారిలో ఒకరు అజిత్ కాగా. మరొకరు సింబు. సింబుతో రూపొందించే సినిమా నవంబర్ లో ప్రారంభం కానుండగా. అజిత్ తో తెరకెక్కించే సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది.  సూర్యకి చెప్పిన లైన్ ని వీరిలో ఎవరితో  గౌతమ్ సినిమాగా తీస్తాడో మరి.




నాగ్ మాదిరే బాలయ్యకి..





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Baahubali' dubbing work started
 Samantha Turns Producer
 Upendra to act in Allu Arjun's film ?
 Madhura Sreedhar to release Sairam Shankar's 'Romeo'
 "It is the only similarity between 'Aagadu' and 'Gabbar Singh'"
 Rana's 'One Night Stand' with Sunny Leone
 'Manikanta Leelalu' shooting starts
 'Aagadu' Hyderabad Theatres List
 'Pesarattu' shooting completed
 Hrithik-Katrina dance their heart out in 'Bang Bang' title track!
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.