1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

శ్రీరామరాజ్యం లాగే

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

బాలకృష్ణ, నయనతార జంటగా 'శ్రీరామరాజ్యం' వంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించి.. నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు యలమంచిలి సాయిబాబా. ఆ సినిమాతో ప్రేక్షకుల నుంచి, పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసలతో పాటు అవార్డులను సైతం పొందారాయన.

'శ్రీరామరాజ్యం' వంటి జనాదరణ పొందిన సినిమా తరువాత యలమంచిలి సాయిబాబు నిర్మించిన చిత్రం 'ఇంటింటా అన్నమయ్య.'. ఆయన తనయుడు రేవంత్ హీరోగా నటించిన ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకుడు.

'జర్నీ' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అనన్య ఇందులో ఓ హీరోయిన్ గా నటించిది. కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రం విడుదల పరంగా వాయిదాలు పడుతూ వస్తోంది. తొలుత ఈ సినిమాని మే నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఆ తరువాత డీలే పడ్డ ఈ సినిమా ఇప్పుడు కొత్తగా మరో విడుదల ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుందట. విశేషమేమిటంటే.. యలమంచిలి సాయిబాబా గత చిత్రం 'శ్రీరామరాజ్యం' కూడా రెండేళ్ల క్రితం ఇదే నవంబర్ (17)లో విడుదలయ్యింది. మరి ఆ నవంబర్ సెంటిమెంట్ ఈ సినిమాకి ఫలించి మంచి పేరుతో పాటు అవార్డులు సైతం రావాలని ఆశిద్దాం.
Rudramadevi First Look

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.