1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రారంభమైన తమాషా

IndiaGlitz [Saturday, November 09, 2013]
Comments

శ్రీ జ్యోతి ప్రసన్న మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'తమాషా'. శ్రీ, నీలమ్ ఉపాధ్యాయ, సునీత మార్షియా హీరో హీరోయిన్లు. ఎమ్.విజయవర్ధనరావు, శివారెడ్డి నీలపు నిర్మాతలు. శ్రీనివాస్ బల్లా దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శనివారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్లాప్ నివ్వగా, రమణ గోగుల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...

నిర్మాతలు మాట్లాడుతూ' ఇది మా మొదటి ప్రయత్నం. మూడు పాత్రల ఆధారంగా సినిమా ఉంటుంది.  దర్శకుడు సిద్ధిక్ దగ్గర పనిచేశాడు. సినిమాలో కామెడీతో పాటు సీరియెస్ నెస్ ఉంటుంది'. అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ' సిద్దిక్ గారి వలనే నేనిప్పుడు దర్శకుడిగా మారాను. నిర్మాతలకు పరిశ్రమ అంటే అవగాహనతోనే సినిమా చేస్తున్నారు. ఈ నెల 20 నుండి హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. తర్వాత రెండవ షెడ్యూల్ ను విశాఖపట్నంలో చిత్రీకరిస్తాం. సినిమాను ఫిభ్రవరిలోగానీ, మార్చిలోగానీ విడుదల చేస్తాం' అని తెలిపారు.

ఈ సినిమాలో షాయాజీషిండే, ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, రవిప్రకాష్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతంః రఘురామ్, కెమెరాః పూర్ణ, నిర్మాతలుః ఎమ్.విజయవర్ధనరావు, శివారెడ్డి నీలాపు, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వంః శ్రీనివాస్ బల్లా.
Palnadu Gave Me A Good Start As A Producer: VishalOther News


This Friday Disappoints

Tamasha Film With Sri As Hero Takes Off

MAA Mourns AVS

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at Jodhpur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.