1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏమో గుర్రం ఎగరావచ్చు డబ్బింగ్

IndiaGlitz [Monday, November 11, 2013]
Comments

ఆ నలుగురు ఫిలింస్ ప్రై.లిమిటెడ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 'ఏమోగుర్రం ఎగరావచ్చు'. సుమంత్,పింకీ సావిక హీరోహీరోయిన్లు. మదన్ నిర్మాత. చంద్ర సిద్ధార్థ దర్శకుడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ను కూడా పూర్తిచేసుకుంది. ఇప్పుడు మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొనే పనిలో ఉంది.

జీవితంలో ప్రతి విషయం పద్ధతిగా జరగాలనుకునే అమ్మాయికి, ప్రణాళికలు అవసరం లేదనుకునే అబ్బాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా. ఈ కథను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోదరుడు కాంచి అందించగా, మరో సోదరుడు కీరవాణిగారు ఈసినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో, సినిమా విడుదల కూడా తొందరలోనే ఉండవచ్చునని సమాచారం. 2011 లో 'దగ్గరగా దూరంగా'  సినిమాలో కనపడిన సుమంత్ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు మరి.




Sri Hari Priyas Galata In Vizag





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.