close
Choose your channels

చెర్రీ - సుక్కు మూవీ లేటెస్ట్ డీటైల్స్..!

Thursday, September 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నధృవ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో ఓ సినిమా చేయ‌నున్నాడు.

ఈ చిత్రం కోన‌సీమ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ప్రేమ‌క‌ధా చిత్ర‌మ‌ట‌. చ‌ర‌ణ్ మాస్ కి ద‌గ్గ‌ర‌య్యాడు కానీ..ఫ్యామిలీ ఆడియోన్స్ కి అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. అందుక‌నే ఫ్యామిలీ ఆడియోన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం చేస్తున్నాడ‌ని స‌మాచారం. చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్‌ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో ప్రారంభించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.