close
Choose your channels
'చెలియా' ఆడియో రిలీజ్ ఎప్పుడంటే...
Friday, March 17, 2017 • తెలుగు Comments

కార్తీ, అదితిరావు హీరో హీరోయిన్లుగా ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `చెలియా`. ఈ చిత్రంలో కార్తీ ఫైట‌ర్ ఫైల‌ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. `కాట్రు వెలియ‌డు` అనే టైటిల్‌తో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై తమిళంలో సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాను తెలుగు, త‌మిళంలో ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పాట‌ల‌ను త‌మిళంలో మార్చి 20న విడుద‌ల చేస్తుంటే తెలుగులో మాత్రం మార్చి 21న విడుద‌ల చేస్తున్నారు.