close
Choose your channels

'చెలియా' రిలీజ్ డేట్ కన్ ఫర్మ్...

Friday, March 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసిన నిర్మాత‌గా మ‌రో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా `కాట్రు వెలియ‌డు`. కార్తీ, ఆదితిరావు హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో చెలియా అనే టైటిల్‌తో విడుద‌ల చేయ‌నున్నారు.

ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని హీరో కార్తీ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌డానికి మ‌ణిరత్నం స‌న్నాహాలు చేస్తున్నారు. అల్రెడి విడుద‌లైన ట్రైల‌ర్ చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.