close
Choose your channels

రెడీ అవుతున్న 'కొలంబస్'

Sunday, October 11, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం 'కొలంబస్'. 'డిస్కవరింగ్ ల‌వ్' అనేది ఉపశీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ఇందులో కథానాయికలు. ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ..

నిర్మాత మాట్లాడుతూ ``ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరి. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్ మంచి నటన కనబర్చడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో న‌టించాడు. ఇష్క్ సినిమా ర‌చ‌యిత‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌.సామ‌లను ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది.

ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. త్వ‌ర‌లో పాట‌లను, వ‌చ్చే నెల 13న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి`` అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.