close
Choose your channels

యదార్థ ఘటన ఆధారంగా 'డేగల శ్రీను' ప్రారంభం

Wednesday, April 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్‌.ఎఫ్‌.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అమ‌ర్‌నాథ్ మండూరి ద‌ర్శ‌క నిర్మాణంలో కొత్త చిత్రం బుద‌వారం హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి సాగ‌ర్ క్లాప్ కొట్ట‌గా, బాబూ మోహ‌న్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.స‌ముద్ర తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌క నిర్మాత అమ‌ర్‌నాథ్ మండూరి సినిమా గురించిన విశేషాల‌ను తెలియ‌జేశారు.

అమ‌ర్‌నాథ్ మండూరి మాట్లాడుతూ ..నేను గుంటూరు లోక‌ల్ ఛానెల్‌లో నేను ఇర‌వై సంవ్స‌త‌రాల‌కు పైగా వ‌ర్క్ చేస్తున్నాను. అలాగే క‌ర్త‌వ్య భార‌తి అనే పేప‌ర్‌కు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గుంటూరులో జ‌రిగిన ఓ యదార్థ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని, దానికి కొన్ని క‌ల్పితాలు జోడించి డేగ‌ల శ్రీను సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో అంద‌రూ హీరోలే, అంద‌రూ విల‌న్లే. యూత్ ఈగో స‌మ‌స్య‌ల‌తో 50 హత్య‌ల‌కు ఎలా దారి తీసింద‌నేదే ఈ సినిమా క‌థ‌. సినిమాలో పెద్ద నట‌నటులంద‌రూ ప‌నిచేస్తారు. కాశ్మీర్‌కు చెందిన జ‌హీదా శ్యామ్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. ఇర‌వై రోజుల త‌ర్వాత గుంటూరు, విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. రెండు షెడ్యూల్స్‌లో 80 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ చేయ‌బోతున్నాం. స‌మాజంలో పోలీసు వ్య‌వ‌స్థ అవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేసే విధంగా కూడా సినిమా ఉంటుంద‌ని తెలిపారు.

సినిమాలో చాలా మంచి క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. నాకు అవ‌కాశం ఇచ్చిన అమ‌ర్‌నాథ్ మండూరిగారికి థాంక్స్ అని జ‌హీదా శ్యామ్ చెప్పారు.

సుమ‌న్‌, భానుచంద‌ర్‌, బాబూ మోహ‌న్‌, సీనియ‌ర్ బాల‌య్య, జ‌యప్ర‌కాష్ రెడ్డి, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, వినోద్‌ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః అడుసుమల్లి విజ‌య్‌కుమార్‌, ఎడిటింగ్ః నంద‌మూరి హ‌రి, ఆర్ట్ః భాషా, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌కత్వంః అమ‌ర్‌నాథ్ మండూరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.