close
Choose your channels

100రోజులను పూర్తి చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్'

Thursday, April 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం డిక్టేటర్`. అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీవాస్ దర్శకత్వంలో 2016 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న డిక్టేటర్ విడుదలై ఘన విజయాన్ని సాధించింది. విడుదలైన రోజు నుండి ఏప్రిల్ 22నాటికి వందరోజులను పూర్తి చేసుకుంది. వాచకంలో, వచనంలో సరికొత్త కోణంలో బాలయ్య సరికొత్త రీతిలో ఆవిష్కరించిన శ్రీవాస్ ఇటు సినీ వర్గాలను, అటు ప్రేక్షక లోకాన్ని మెప్పించి బేష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 24న చీపురపల్లిలో డిస్ట్రిబ్యూటర్ భరత్ డిక్టేటర్ వందరోజుల ఉత్సవాన్ని అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ `మా డిక్టేటర్ 100వరోజున ప్రారంభమవుతున్న మా బాలయ్య బాబు ప్రతిష్టాత్మక 100వ చిత్రం చరిత్రలో నిలిచిపోయేంత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.