close
Choose your channels

సంక్రాంతికి పక్కా అంటున్న 'డిక్టేటర్'

Tuesday, November 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం డిక్టేటర్`. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ..

కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ `సినిమాను సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లోనూ విడుదల చేయాలని మా సంకల్పానికి బాలయ్యగారు పూర్తి సహాయ సహాకారాలందిచారు. ప్రతి క్షణం ఆయన అందించిన మద్దతుతొ సినిమా షూటింగ్ చాలా కూల్ గా ఎటువంటి ఆటంకం లేకుండా శరవేగంగా జరుగుతుంది. అలాగే సినిమాలో మిగిలిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందించిన సపోర్ట్ తో సినిమాను అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇప్పటికి సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రెండు పాటలు, రెండు ఫైట్స్, డిల్లీలో చిత్రీకరించాల్సిన కొన్ని సీన్స్ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. డిసెంబ‌ర్ లో ఆడియో విడుదల చేసి సినిమాను సంక్రాంతికి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.