close
Choose your channels
పాతికేళ్ళ తర్వాత సినిమా చేస్తున్నారు...
Monday, March 20, 2017 • తెలుగు Comments

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రోబో సీక్వెల్ `2.0` ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్బంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. `2.0` త‌ర్వాత ధ‌నుష్ నిర్మాత‌గా వండ‌ర్ బార్స్ ప్రొడ‌క్ష‌న్‌లో క‌బాలి ఫేమ్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రారంభ‌మవుతుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ సినిమాలో విద్యాబాల‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి ఖుష్బూ ఇద్ద‌రు క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఐదు సినిమాలు వ‌చ్చాయి. ఇద్ద‌రు క‌లిసి 1992లో అన్నామ‌లై చిత్రంలో చివ‌ర‌గా న‌టించారు. పాతికేళ్ళ త‌ర్వాత మ‌రోసారి ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు. మ‌రి వీరి పాత్ర‌ల ప్రాముఖ్య‌త ఏమిటో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే..