close
Choose your channels

జూలై 14 న ప్రపంచ వ్యాప్తంగా 'డా చక్రవర్తి' విడుదల

Thursday, July 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీ వేంకటేశ్వర సూపర్‌ మూవీస్‌ బ్యానర్‌పై 'ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌' వంటి సెన్సేషనల్‌ చిత్రాన్ని రూపొందించిన శేఖర్‌ సూరి దర్శకత్వంలో ఎ. వెంకటేష్‌ (ఛాంప్‌), శేఖర్ సూరి, బి. ఆర్. రత్నమాల రెడ్డి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'. రిషి, సోనియామాన్‌ హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ కార్యక్రమం లో రిషి, సోనియా మాన్, గిరీష్ సహదేవ్, అనిరుద్ సింగ్, లీనా, వంశీ, అశోక్, విజయ్ కురాకుల, దర్శకుడు శేఖర్ సూరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్‌ సూరి మాట్లాడుతూ...ఒక యదార్థ సంఘటన ఆధారంతో.. చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'. నేను కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామినే. ఈ చిత్ర రూపకల్పన కోసం ఆర్టిస్ట్స్ ఎంతగానో సహకరించారు. రిషి, సోనియా, లీనా అలాగే నటుడు అశోక్ కుమార్ గారి అబ్బాయి వంశీ వంటి వారంతా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో చిత్రాన్ని తెరకెక్కించాము. 2015 లో బాంబే లో జరిగిన యదార్థగాధ ఇది. ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా ఉంటుంది. విజయ్‌ కురాకుల మ్యూజిక్‌ ఈ చిత్రానికి పెద్ద హైలైట్‌ అవుతుంది. అల్రెడీ విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. జూలై 14 న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము.. ప్రేక్షకులు మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.

ఈ కార్యక్రమం లో హాజరైన అందరూ..ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.

రిషి, సోనియామాన్‌, గిరీష్‌ సహదేవ, లీనా, వంశీ, అశోక్‌కుమార్‌, కుమారన్‌, చైతన్య, పూజ, లావణ్య, పోకిరి విజయ్‌, అనిరుధ్‌ సింగ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ కురాకుల, కెమెరా: రాజేందర్‌, ఎఫెక్ట్స్‌: ఇతిరాజ్‌, డైలాగ్స్‌: చిట్టి శర్మ, మిక్సింగ్‌: రంగరాజు; ఎడిటింగ్‌: తిరుపతి రెడ్డి, నిర్మాతలు: ఎ. వెంకటేష్‌ (ఛాంప్‌), శేఖర్ సూరి, బి. ఆర్. రత్నమాల రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శేఖర్‌ సూరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.