close
Choose your channels

బాల‌య్య కూడా అంతేన‌ట‌

Saturday, November 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌య్య ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నామ‌ని నిర్మాత‌లు ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఓ రోజు ముందుగానే అంటే జ‌న‌వ‌రి 11న సినిమాను విడుద‌ల చేయాల‌ని ఇప్పుడు అనుకుంటున్నారట‌.

అందుకు కార‌ణం సంక్రాంతి సెల‌వులను అనుకూలంగా మార్చుకోవ‌డ‌మే. అందుకోస‌మ‌ని అనుకున్న విడుద‌ల తేదీ కంటే ఓ రోజు ముందుగానే రావాల‌ని అనుకుంటున్నార‌ట‌. అలాగే మ‌రోపైపు మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150` సినిమాను కూడా ముందు జ‌న‌వ‌రి 13న విడుల చేయాల‌ని అనుకున్నారని న్యూస్ విన‌ప‌డింది. కానీ ఇప్పుడు సంక్రాంతి సెల‌వులు దృష్ట్యా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఓకే రోజు ఇద్ద‌రు స్టార్ హీరోస్ సినిమాలు రానుండ‌టం. ఇద్ద‌రికీ ఈ రెండు ప్రెస్టిజియ‌స్ మూవీస్ కావ‌డం విశేషం. మ‌రి చివరికి ఏమౌతుందో చూడాలి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.