close
Choose your channels

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమా

Friday, July 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వంగవీటి సినిమా హీరో సాండి, దళం దర్శకుడు జీవన్ రెడ్డి, ఇటీవలి కాలంలో వందకోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠీ సినిమా సాయిరాత్` కెమెరామన్ సుధాకర్ ఎక్కంటి ల క్రేజీ కాంబినేషన్ లో ఓ భారీ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. వంగవీటి` సినిమా కథానాయకుడు సాండీ జార్జ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు.దళం జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ చేస్తాం. 1962 నుంచి 1972 సంవత్సరాల్లో విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఓయూ పరిణామాలు, జార్జ్ జీవితంలో జరిగిన సంఘనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ్రీప్రొడక్షన్ కు సంబంధించిన వర్క్ కంప్లీట్ అయ్యింద, ైదరాబాద్, వరంగల్, కేరళ, ఔరంగాబాద్, ముంబాయి, పూణె లో ఈ సినిమా చిత్రీకరణ ప్లాన్చేస్తున్నాం. భారీ బడ్జెట్ తో తెలుగు సినిమాల్లోనే ఒక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ సినిమాలో ప్రముఖ తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, మళయాల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను రెండు ప్రధాన నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేస్తాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.