close
Choose your channels

ద‌స‌రాకి వ‌స్తున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి..!

Wednesday, September 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రాజీవ్ రెడ్డి, క్రిష్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య త‌ల్లిగా హేమ‌మాలిని న‌టిస్తుంటే...భార్య‌గా శ్రియ న‌టిస్తుంది.

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి కీల‌క స‌న్నివేశాల‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చిత్రీక‌రిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం....అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ ను ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి కంచె ఫేమ్ చిరంతాన్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.