close
Choose your channels

చిరంతన్‌ భట్‌ సంగీత దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' పాట చిత్రీకరణ

Saturday, September 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా....

చిత్ర నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ''ఈ చిత్రానికి గతంలో క్రిష్‌ దర్శకత్వం వహించిన జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ కంచె చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్‌భట్‌ను దేవిశ్రీ ప్రసాద్‌ స్థానంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకున్నాం. అల్రెడి చిరంతన్‌ ఈ సినిమా ఓ సాంగ్‌ను కంపోజ్‌ చేసేశారు కూడా. ఈ పాట చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తున్నాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన సీనియర్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ స్వర్ణ నృత్య దర్శకత్వంలోనీ సాంగ్‌ను మధ్యప్రదేశ్‌లో చిత్రీకరించనున్నారు. ముంబైకి చెందిన క్లాసికల్‌ డ్యాన్సర్స్‌ ఈ పాటలో నర్తిస్తున్నారు. పది రోజుల పాటు బాలకృష్ణ ఇతర తారాగణంపై చిత్రీకరించనున్న ఈ సాంగ్‌ కోసం అద్భుతమైన రాజదర్బార్‌ సెట్‌ను వేశారు. సెప్టెంబర్‌ 25 వరకు జరిగే ఈ సాంగ్‌ చిత్రీకరణతో తాజా షెడ్యూల్‌ పూర్తవుతుంది. ఇప్పటి వరకు మూడు షెడ్యూల్స్‌ను వేర్వేరు లోకేషన్స్‌లో చిత్రీకరించాం. ఇప్పుడు నాలుగో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో రాజసూయ యాగం సహా కీలక సన్నివేశాలను, ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. దీంతో 80 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. వి.ఎఫ్‌.ఎక్స్‌ కోసం నాలుగు స్పెషల్‌ టెక్నికల్‌ టీమ్‌లు పనిచేస్తున్నాయి. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.