close
Choose your channels

'ఆరడుగుల బుల్లెట్ ' తప్పకుండా విజయం సాధిస్తుంది - గోపీచంద్

Saturday, June 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గోపీచంద్‌, నయనతార జంటగా బి.గోపాల్‌ దర్శకత్వంలో జయ బాలాజీ రియల్‌ మీడియా పతాకంపై రూపొందుతోన్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అరడుగుల బుల్లెట్‌. ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ సీడీని బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ విడుద‌ల చేసి ఎ.ఎం.ర‌త్నంకు అందించారు.

విజువ‌ల్స్ బావున్నాయి, సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌ని ఎ.ఎం.ర‌త్నం చెప్పారు. గోపీచంద్ సినిమాల్లో ఉండే మాస్ ఈ సినిమాలో క‌న‌ప‌డుతుంది. తండ్రి కొడుకుల మ‌ధ్య మంచి అనుబంధం, మంచి ఇంట‌ర్వెల్ బ్లాక్ ఉంది. గోపీచంద్‌గారి మీట‌ర్‌లో డైలాగులు రాశాను. బుల్లెట్‌లాంటి డైలాగులు ఇందులో ఉంటాయి. న‌ర‌సింహ‌నాయుడు సినిమాను వైజాగ్‌లో రెండు సార్లు చూశాను. గోపాల్‌గారు ప‌నిచేయించుకునే విధానం అద్భుతంగా అనిపిస్తుంది. ఆయ‌న ఎవ‌రినీ బాధ‌పెట్ట‌రు. ఆయ‌న కోసం ఇంకొక‌టి చేద్దామ‌ని అనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌కాశ్‌రాజ్‌గారు ఫోన్ చేసి `ఇందులో ఒక్క‌ముక్క క‌రెక్ట్ చేద్దామంటే కుద‌ర‌లేదు. అంత మంచి సీన్ రాశావు` అని అన్నారు. చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా చాలా ప‌ద్ధ‌తిగా ఉంటుంది. బూతు ఉండ‌దు. కుటుంబం అంతా ప్ర‌శాంతంగా క‌లిసి చూడ‌ద‌గ్గ సినిమా అని అబ్బూరి ర‌వి తెలిపారు.

సినిమా జూన్ 9న విడుద‌ల‌వుతుంది. గోపీచంద్‌ మాస్‌, యాక్ష‌న్‌, సాంగ్స్, కామెడీ అన్నీ బాగా చేస్తాడు. న‌య‌న‌తార కేర‌క్ట‌ర్ బావుంటుంది. ప్ర‌కాశ్‌రాజ్‌గారు చాలా బాగా చేశారు. గోపీచంద్‌, ప్ర‌కాశ్‌రాజ్ గారి మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌న్నీ అద్భుతంగా ఉంటాయి. నాలుగు పాట‌లు బావుంటాయి. వ‌క్కంతం వంశీగారు, అబ్బూరి ర‌వి చాలా బాగా రాశారు. టీమ్ అంతా క‌ష్ట‌ప‌డి చేశామ‌ని ద‌ర్శ‌కుడు బి.గోపాల్ తెలిపారు. ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ల‌డానికి చాలా మంది స‌హ‌క‌రించారు. మా సినిమా కాస్త లేట్ అయినా స‌రే బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర‌మ‌వుతుంద‌ని న‌మ్మ‌కం ఉందని నిర్మాత తాండ్ర రమేష్ తెలిపారు.

మ‌ణిశ‌ర్మ‌గారు చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఆయ‌న‌తో నా కాంబినేష‌న్ చాలా వ‌ర్క‌వుట్ అయింది. ఈ సినిమాకు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. గోపాల్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌నే కోరిక ఈ సినిమాతో తీరింది. మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. నిర్మాత‌లు చాలా బాగా తీసుకొచ్చారు. కాస్త లేట్ అయినా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. వంశీ చెప్పిన క‌థ చాలా బాగా వ‌చ్చింది. ఎమోష‌న్స్ కూడా చాలా బాగా పండాయి. లేట్ అయినా సినిమా చాలా బాగా వ‌చ్చింది అని గోపీచంద్ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.