close
Choose your channels

హ్యాపీ బర్త్ డే టు యంగ్ టైగర్ ఎన్టీఆర్

Saturday, May 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌...పేరులోనే పవర్‌ ఉంది
నందమూరి నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నందమూరి తారక రామారావు తన నటన, స్టయిల్‌, డ్యాన్సులు, ఫైట్స్‌తో అలరించి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకొని నెంబర్‌వన్‌ రేసులో దూసుకెళ్లున్నారు. డైలాగ్‌ డెలివరి, డ్యాన్స్‌ల్లో షార్ప్‌నెస్‌, స్పాంటేనియస్‌ యాక్టింగ్‌ సంచలనాలతో తెలుగు ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టిస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. మాస్‌లో తిరుగులేని క్రేజ్‌, బాక్సాఫీస్‌ను షేక్‌ చేసే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎన్టీఆర్‌ సొంతం. తాతగారి నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.

తాతకు తగ్గ మనవడిగా...
యంగ్‌ హీరోగా అన్ని విభాగాల్లో టాప్‌లో ఉన్నప్పటికీ భారీ డైలాగ్స్‌ చెప్పడంలో తాతకి తగ్గ మనవడే అనిపించుకున్నాడు. జయాపజయాలకు అతీతమైన ప్రేక్షకగణం ఆయన సొంతం. పంచ్‌, పవర్‌ ఉన్న కథానాయకుడు. ఎన్టీఆర్‌ కెరీర్‌ గ్రాఫ్‌లో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మెట్టు. నిర్మాతల పాలిట కామధేనువు, మీ పెట్టుబడులకు నేను గ్యారంటీ అనేంత స్టామినా బాద్‌ షా సొంతం. హీరోగా 14 ఏళ్ల కెరీర్‌లో అనేక ఎత్తుపల్లాలను, విమర్శలను చవిచూసినా బాక్సాఫీస్‌ బాద్‌షాగా ఎదిగారు. రజనీకాంత్‌ తర్వాత జపాన్‌ దేశంలో క్రేజ్‌ ఉన్న హీరోగా తెలుగు సినీ ప్రేక్షకులచే ఔరా! అనిపించుకున్నారు. ఆవేశపూరితమైన సన్నివేశంలో ప్రేక్షకుణ్ణి లీనమైయ్యేలా చేయడం, ఎంత పెద్ద డైలాగ్‌నైనా సునాయాసంగా చెప్పడం తనకే సాధ్యం.

బాల నటుడి నుండి యంగ్‌ టైగర్‌గా..
బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాలరామాయణం సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, నిన్నుచూడాలని సినిమాతో హీరోగా రంగప్రవేశం చేసిన యంగ్‌ టైగర్‌ తన నెక్ట్స్‌ సినిమా టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి డైరెక్షన్‌లో స్టూడెంట్‌ నెంబర్‌వన్‌తో తన పెర్‌ఫార్మెన్స్‌ చూపించి హీరోగా ప్రూవ్‌ చేసుకున్నారు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ డైరెక్ట్‌ చేసిన ఆది చిత్రంతో స్టార్‌ హీరోగా నిలదొక్కుకుని ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునేలా చేసుకున్నారు. మరోమారు రాజమౌళి దర్శకత్వంలో సింగమలై అంటూ సింహాద్రిగా గర్జించి బాక్సాఫీస్‌ రికార్డులను షేక్‌ చేశారు. ఈ చిత్రం విజయంతో అనూహ్యంగా ఆగ్రకథానాయకుల సరసన చేరారు. కృష్ణవంశీ దర్శకత్వంలో, ఆడపడుచుల మీద జరుగుతున్న అత్యాచారాలను ప్రతిఘటించే రాఖీగా, సమాజంలోని తప్పులను ఎత్తి చూపే తెలుగింటి ఆడపడుచుల అన్నగా ఎదురొడ్డి నిలబడ్డారు. అప్పటి వరకు బొద్దుగా ఉన్న యంగ్‌టైగర్‌ తననితాను మేక్‌ ఓవర్‌ చేసుకుని సరికొత్త యమదొంగగా మరోసారి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టారు. ఈ చిత్రంలో యంగ్‌ యముడిగా ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాలను చేయడమే కాదు. కామెడీని పండించడంలో కూడా తనకు తానే సాటి అనే విధంగా అదుర్స్‌ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి ఎన్టీఆర్‌ నటన అదుర్స్‌ అని ప్రేక్షకులతో అనిపించుకున్నారు. ఒకవైపు కామెడీ, మరోవైపు యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం చిత్రంలో రెండు కుటుంబాలను కలిపే కృష్ణుడిలా నటించి మెప్పించి కుటుంబకథా చిత్రాల హీరోగా నిరూపించు కున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఒక వర్గం ప్రేక్షకులను అలరించకుండా ఊసరవెళ్లిలా అన్ని వేరియషన్స్‌ చూపిస్తూ ఒక ఆల్‌రౌండర్‌గా ఎదిగారు. డిసైడ్‌ అయితే వార్‌ వన్‌ సైడ్‌ అవుతుందనే బాద్‌షాగా ఓవర్‌సీస్‌లోనూ తన సత్తా చాటారు. ఇప్పటి తరం నటుల్లో డ్యాన్స్‌ల్లో సరికొత్త స్టెప్పులను ఇంట్రడ్యూస్‌ చేస్తూ నందమూరి అభిమానులకు సరికొత్త డ్యాన్సింగ్‌ స్టార్‌గా అవతరించారు. ఇటు మాస్‌, అటు క్లాస్‌ దర్శకుల కోసం తననితాను మౌల్డ్‌ చేసుకునే సత్తా ఉన్న దర్శకుల హీరో. రభస చిత్రంతో హీరోగా తన స్టామినా చూపించారు.

హ్యాట్రిక్‌ హిట్స్‌..100 కోట్ల హీరో
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన టెంపర్‌ చిత్రంలో తన నటనలో సరికొత్త యాంగిల్‌ను పరిచయం చేసి ప్రేక్షకులచేత శెభాష్‌ అనిపించుకున్నారు. అప్పటి వరకు ప్రేక్షకులు చూసిన ఎన్టీఆర్‌, టెంపర్‌లో తెరపై కనపడ్డ ఎన్టీఆర్‌ డిఫరెంట్‌గా ఉండటం, పూరి డైరెక్షన్‌ స్టయిల్‌, యాక్టింగ్‌లో ఎన్టీఆర్‌ డెడికేషన్‌తో టెంపర్‌ బాక్సాఫీస్‌ను హీటెక్కించింది. భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా విలక్షణ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్‌సీస్‌లో కూడా కలెక్షన్స్‌ కొల్లగొట్టాడు. సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో వచ్చిన 'జనతాగ్యారేజ్‌'తో 100 కోట్ల హీరోగా రికార్డులను క్రియేట్‌ చేశాడు.

తొలిసారి త్రిపాత్రాభినయం...
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, అన్న నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మాతగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పైక.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'జై లవకుశ'. ఈ చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అల్రెడి విడుదలైన టైటిల్‌ లోగో మిలియన్‌ వ్యూస్‌తో హ్యుజ్‌ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటే, ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు ఔనత్యాన్ని పెంచారు. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి రికార్డుల చరిత్ర తిరగరాయడానికి సన్నద్ధమవుతున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మే 20న పుట్టినరోజు జరుపుకుం టున్నారు.

....................................హ్యాపీ బర్త్‌ డే టు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌..................

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.