close
Choose your channels

ఎదుట వ్యక్తికి సాయం చేయడానికి మంచి మనసు ఉంటే చాలు అని చెప్పే వైవిధ్యమైన చిత్రం ఛల్ ఛల్ గుర్రం - హీరో శైలేష్

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో మోహ‌న ప్ర‌సాద్ తెర‌కెక్కించిన చిత్రం ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం. ఎం.ఆర్. ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఎం.రాఘ‌వ‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్నక‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం ట్రైల‌ర్ & ఆడియో బాగుంది అంటూ చిత్ర బృందాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభినందించ‌డం విశేషం. దీపావ‌ళి కానుక‌గా ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం సినిమా ఈనెల 28న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శైలేష్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం..!
ఈ మూవీలో మీకు అవ‌కాశం ఎలా వ‌చ్చింది..?
నేను ముకుంద సినిమాలో న‌టించాను. ఆత‌ర్వాత వైజాగ్ లో మా ఫాద‌ర్ బిజినెస్ వ‌ర్క్ లో ఉన్నాను. ఓ రోజు ఈ చిత్ర నిర్మాత ఎం.రాఘ‌వ‌య్య గారు ఈక‌థ చెప్పారు. రెగ్యుల‌ర్ గా కాకుండా డిఫ‌రెంట్ గా ఉండ‌డంతో ఈ మూవీ చేయ‌డానికి ఓకే అన్నాను. ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం అంద‌రికీ న‌చ్చుతుంది అని మా న‌మ్మ‌కం.
ముకుంద సినిమాలో న‌టించాను అన్నారు క‌దా..! అస‌లు ముకుంద సినిమాలో ఛాన్స్ ఎలా వ‌చ్చింది..?
నేను కారు రేసింగ్ లో ఛాంపియ‌న్ గా నిలిచాను. జాతీయ స్ధాయిలో కారు రేసింగ్ లో పాల్గొన్నాను. అయితే...కారు రేస‌ర్ విన్న‌ర్ గా ఇంట‌ర్ వ్యూ ఇస్తున్న‌ప్పుడు నా బాడీ లాంగ్వేజ్ స‌రిగా లేద‌ని ఎవ‌రో మా ఫాద‌ర్ కి చెప్పార‌ట‌. అప్పుడు కెమెరాను ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవ‌డం కోసం స‌త్యానంద్ గారు ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుందామ‌ని వెళ్లాను. ఆయ‌న ద‌గ్గ‌ర 3 మంత్స్ కోర్స్ ను పూర్తి చేయ‌డానికి నేను బిజీగా ఉండ‌డం వ‌ల‌న 9 నెల‌లు ప‌ట్టింది. ఆ టైమ్ లో శ్రీకాంత్ అడ్డాల గారు ఓ క్యారెక్ట‌ర్ కోసం ఎవ‌రైతే బాగుంటారా అని చూస్తున్నార‌ట‌. ఓరోజు స‌త్యానంద్ గారు నాకు ఫోన్ చేసి ఈ విష‌యం చెప్పారు. న‌న్ను శ్రీకాంత్ అడ్డాల గార్కి ప‌రిచ‌యం చేసారు. ఆయ‌న న‌న్ను చూసి ముకుంద‌లో ఆఫ‌ర్ ఇచ్చారు. ఆవిధంగా ముకుంద‌లో అవ‌కాశం వ‌చ్చింది.
ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం క‌థ ఏమిటి..?
ఎదుట వ్య‌క్తికి సాయం చేయ‌డానికి ఫ్యామిలీ మెంబ‌రే చేయాల్సిన అవ‌స‌రం లేదు. సాయం చేయాల‌నే మంచి మ‌న‌సు ఉంటే చాలు అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉంటుంది. ఇందులో రెండు కంపెనీల్లో వ‌ర్క్ చేసే ఎంప్లాయిస్, ఫ్రెండ్స్ క‌నిపిస్తారు. వాళ్ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ ను కూడా చూపించం. నాగ‌బాబు గారు మెయిన్ రోల్ చేసారు.ఇదో డిఫ‌రెంట్ మూవీ.
ఈ మూవీలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?
ఒకే అపార్టెమెంట్ లో రెండు కంపెనీలు ఉంటాయి. ఈ రెండు కంపెనీల్లో ఒకే టైమ్ లో రెండు ఉద్యోగాలు చేస్తుంటాను. రెండు కంపెనీల‌కు తెలియ‌కుండా రెండు ఉద్యోగాలు ఎలా చేసాను. ఇలా చేస్తున్న టైమ్ లో ఎలాంటి ప‌రిస్ధితులు ఎదుర‌య్యాయి..? వాటిని నేను ఎలా ఎదుర్కొన్నాను అనేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా, ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది.
ముకుంద సినిమాలో ఓ క్యారెక్ట‌ర్ చేసారు. ఇప్పుడు హీరోగా చేసారు క‌దా..! ఎలా అనిపించింది..?
ముకుంద సినిమాలో క్యారెక్ట‌ర్ చేయ‌డం ఈజీ. హీరోగా చేయ‌డం అంటే కామెడీ, డ్యాన్స్ చేయ‌డం క‌ష్టం అనిపించింది.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా ట్రైల‌ర్ చూసి అభినందించారు క‌దా..! ప‌వ‌న్ ని క‌లిసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యారు..?
ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ఓ వైపు జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో మ‌రో్ వైపు కాట‌మ‌రాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ మా మూవీ ట్రైల‌ర్ చూసి బాగుంది అని అభినందించ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. మా చిత్ర నిర్మాత ఎం.రాఘ‌వ‌య్య జ‌న‌సేన పార్టీ ట్రెజ‌రర్. ఆయ‌న ఓ మంచి చిత్రాన్ని అందించాల‌నే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మా సినిమా విజ‌యం సాధించాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ఆశీస్సులు అందించ‌డం చాలా సంతోషం క‌లిగించింది.
కారు రేసింగ్, ఏక్టింగ్ రెండింటిలో ఏది క‌ష్టం..?
కారు రేసింగ్ చాలా ఈజీ. ఏక్టింగ్ క‌ష్టం.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
నెగిటివ్ రోల్ చేయ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ...ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.