close
Choose your channels

విక్రమ్ సీక్వెల్ లో వీరే హీరోయిన్స్..

Wednesday, February 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చియాన్ విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో 2003లో విడుద‌లైన సామి సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో ల‌క్ష్మీ న‌ర‌సింహా పేరుతో బాల‌కృష్ణ రీమేక్ కూడా చేశాడు. తెలుగులో కూడా సినిమా భారీ విజ‌యాన్ని అందుకుంది. దాదాపు ప‌ద్నాలుగేళ్ళ త‌ర్వాత సామి సీక్వెల్ త‌మిళంలో రూపొంద‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప‌నుల‌న్నీ పూర్త‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే మూవీ సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. శిబు త‌మీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్‌లో భాగంగా విక్ర‌మ్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. అందులో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను పేరు ముందు వ‌రుస‌లో ఉండ‌గా, క్యాథ‌రిన్ థెస్రా పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. మ‌రిప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌కుండా డ‌బ్ చేసి విడుద‌ల చేస్తారు. అందుకు కార‌ణం...ఇప్పుడు విక్ర‌మ్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉండ‌ట‌మే కార‌ణం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.