close
Choose your channels

రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటి ఇచ్చిన హైపర్ ప్రొడ్యూసర్..!

Tuesday, September 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ హైప‌ర్ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన హైప‌ర్ చిత్రంలోని ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు.
అయితే...హైప‌ర్ మూవీ రిలీజ్ వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 6న హైప‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు అంటూ ఫిల్మ్ న‌గ‌ర్ లో ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెడుతూ హైప‌ర్ ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర్ ట్విట్ట‌ర్ లో...పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ హైప‌ర్ స్పీడుతో జ‌రుగుతుంది. ఈనెల 30న హైప‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నాం అంటూ సందించారు..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.