close
Choose your channels

జాకీచాన్ తో క‌ల‌సి న‌టిస్తున్న హీరోయిన్..?

Saturday, October 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యాక్షన్ మూవీస్ తో ఆక‌ట్టుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ జాకీచాన్. ఆయ‌న తాజాగా న‌టిస్తున్న చిత్రం కుంగ్ ఫూ యోగ‌. ఈ చిత్రానికి స్టాన్లీ టాంగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో సోనూ సూద్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం దుబాయ్ లో జాకీచాన్, సోనూసూద్ ల‌పై ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ విష‌యానికి వ‌స్తే...తెలుగులో ఎన్నోవిజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ఇలియానాని జాకీచాన్ స‌ర‌స‌న హీరోయిన్ గా ఎంపిక చేసార‌ని బాలీవుడ్ స‌మాచారం. గ‌తంలో ద మిత్ చిత్రంలో జాకీచాన్ స‌ర‌స‌న మ‌ల్లికా శెరావ‌త్ న‌టించారు. క‌నుక జాకీచాన్ మూవీలో ఇలియానా న‌టించ‌డం నిజ‌మైతే... జాకీచాన్ తో న‌టించిన రెండో భార‌తీయ న‌టిగా క్రెడిట్ ఇలియానాకే ద‌క్కుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.