close
Choose your channels

సూర్య నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

Thursday, September 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య ప్ర‌స్తుతం సింగం 3 సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతి హాస‌న్ న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న సింగం 3 చిత్రాన్ని దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత సూర్య ముత్త‌య్య ద‌ర్శ‌కత్వంలో న‌టించ‌నున్నారు.
ఈ మూవీలో సూర్య ఇద్ద‌రు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయ‌నున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు హీరోయిన్స్ ఎవ‌రంటే...నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్, సాల ఖ‌ద్దూస్ ఫేమ్ రితికా సింగ్. గ్రామీణ నేప‌ధ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్ టైన్మెంట్ & స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల రెండో వారంలో ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.