close
Choose your channels

పూరి, ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా....?

Monday, September 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`జ‌న‌తాగ్యారేజ్` స‌క్సెస్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి `టెంప‌ర్` వంటి స‌క్సెస్ ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. పూరి ఇప్పుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌తో ఇజం సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

ఈ సినిమా త‌ర్వాత పూరి ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సినిమా చేస్తాడ‌ట‌. తాజాగా ఈ సినిమాకు పూరి `420` అనే టైటిల్ పెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. ఇడియ‌ట్‌, దేశ‌ముదురు, పోకిరి, నేనింతే, రోగ్, లోఫ‌ర్ వంటి నెగ‌టివ్ టైటిల్స్‌తో హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను డిఫ‌రెంట్ స్టైల్‌ను ప్రెజెంట్ చేసే పూరి ఇప్పుడు ఎన్టీఆర్‌ను `420`ని చేస్తాడా? ఏమో తెలియాలంటే వేచి చూడ‌క త‌ప్ప‌దు ...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.