close
Choose your channels

నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల ఇజం టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌

Wednesday, September 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్నపవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇజం. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల‌ 5న పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విడుదలైన 48 గంటలలోపే ఈ టీజర్‌ 1 మిలియన్‌ వ్యూస్‌ క్రాస్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ చిత్రంలోని కళ్యాణ్‌రామ్‌ లుక్‌కి మంచి అప్రిషియేషన్‌ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఇజం చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.