close
Choose your channels

బిగ్ బాస్ లో జబర్ దస్త్ కమెడియన్

Thursday, July 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ స్టార్స్ అంద‌రూ ఇప్పుడు బుల్లితెర వైపు అడుగులేస్తున్నారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రాంతో అక్కినేని నాగార్జున ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తే, ఇప్పుడు అదే షోతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్ష‌కుల‌ను అలరిస్తున్నారు. కాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా స్టార్‌మా టీవీలో ప్రసారం కానున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్‌'. ఎన్టీఆర్‌ తొలిసారి బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

బిగ్‌బాస్‌ షో ఈ నెల 16 నుండి ప్రసారం కానుంది. ఓ పెద్ద ఇంటిలో 12 మంది సెలబ్రిటీలను నిర్భందిస్తారు. ప్రతి ఒకరి కదలికను 60 కెమెరాలతో గమనిస్తుంటారు. తెలుగులో స్టార్ట్ అవుతున్న తొలి రియాలిటీ షో ఇది. షో టెలికాస్ట్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది కానీ అందులో కంటెస్టెంట్స్ ఎవ‌ర‌నేదాని గురించి ఎవ‌రికీ పూర్తి అవ‌గాహ‌న లేదు. పోసాని కృష్ణ‌ముర‌ళి ఒక కంటెస్టెంట్ అని విన‌ప‌డింది. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ షోలో ధ‌న‌రాజ్ ఒక కంటెస్టెంట్‌గా న‌టిస్తున్నాడని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.