close
Choose your channels

చిరు 150వ సినిమాలో జగపతిబాబు...?

Saturday, May 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 150వ సినిమా సెట్స్ లోకి వెళ్లడానికి హంగులను సిద్ధం చేసుకుంటుంది. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార, అనుష్క పేర్లు వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు అనుష్క పేరు ప్రముఖంగా వినపడుతుంది.

అలాగే ఈ చిత్రంలో విలన్ గా ఎవరు చేస్తారనే దానిపై బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్, అరవింద్ స్వామి పేర్లు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో ఇప్పుడు జగపతిబాబును విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. లెజెండ్ తో హీరో నుండి విలన్ గా మారిన జగపతి బాబు, తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా విలన్ గా నటించాడు. నందమూరి హీరోల తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి విలన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.