close
Choose your channels

జ‌వాన్‌ని డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కేంద్రుడు

Tuesday, September 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అదేంటి? జ‌వాన్ సినిమాకి బి.వి.ఎస్‌.ర‌వి క‌దా ద‌ర్శ‌కుడు. మ‌రి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఏమిటా? అని అనుకుంటున్నారా..? మ‌రేమి లేదండి..జ‌వాన్ సెట్స్‌కి స‌ర‌దాగా వ‌చ్చిన రాఘ‌వేంద్ర‌రావు.. ఆ చిత్ర హీరోహీరోయిన్లు సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెహ్రీన్‌ల‌పై ఓ షాట్ తీశాడ‌ట‌. అది త‌మ చిత్ర బృందంని ఆశీర్వ‌దించ‌డం కిందే లెక్కంటూ.. ఆ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు ర‌వి ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ మేన‌మామ చిరంజీవి కాంబినేష‌న్‌లో ఎన్నో హిట్ చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కేంద్రుడు.. ఇప్పుడు ఆయ‌న మేన‌ల్లుడుతో సినిమా తీయ‌క‌పోయినా.. ఇలా ఓ షాట్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం మెగాభిమానుల్లో ఆనందాన్ని క‌లిగించే విష‌య‌మే. బ‌హుశా సాయిధ‌ర‌మ్‌, మెహ్రీన్‌ల‌పై ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించింది రొమాంటిక్ సీన్‌నే అయి ఉండొచ్చు. జ‌వాన్ న‌వంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.