close
Choose your channels

జాతీయ అవార్డులు ప్రధానం..ఫాల్కే పురస్కారం అందుకున్న కళాతపస్వి..

Thursday, May 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినిమాకు స‌రికొత్త అర్థాలు చెబుతూ సినిమాలు తీసిన క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. అవార్డు కింద స్వర్ణకమలంతోపాటు ప్రశంసాపత్రం, రూ.10 లక్షల నగదు అందజేశారు. శాలువా కప్పి సన్మానించారు. ప్రతిష్ఠాత్మకమైన అవార్డును అందుకున్న సందర్భంగా కళాతపస్వి భావోద్వేగానికి లోనయ్యారు. వేదిక‌పైనే మాట్లాడారు. వేదిక‌పై మాట్లాడిన తొలి వ్య‌క్తి కూడా విశ్వ‌నాథ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఆయ‌న మాట్లాడుతూ.. నాకు జన్మనిచ్చిన తల్లిదంవూడులకు, దేవుడికి, అవార్డు ఇచ్చిన రాష్ట్రపతికి, నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు, నన్ను ఆదరించిన ప్రజలకు, ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు.. సర్వే జనా సుఖినోభవంతు అన్నారు. ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ అంద‌రికీ ప‌ద్మ‌భూష‌ణ్ వ‌స్తుంటే నాకు ప‌ద్మ‌శ్రీ కూడా రాలేద‌ని అనుకునేవాడిని, అయితే నాకు దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు వ‌చ్చింది. వ‌స్తుంద‌ని నేను ఊహించ‌లేదు. నా సుదీర్ఘ ప్ర‌యాణంలో న‌టులు, నిర్మాత‌ల స‌హకారం ఎంతైనా ఉంది. గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానం ఉన్న‌ప్పుడే త‌ప్పుకుంటే మంచిద‌ని భావిస్తున్నాను. సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిన సందర్భంలో తాను స్మరించుకునేది ముందుగా తన తల్లిదంవూడులనే అని అన్నారు.

ఇప్పటితరం దర్శకుల్లో ఎవ్వరికీ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఈ తరం దర్శకులతోపాటు పరిక్షిశమలో ఉన్నవారందరికీ కష్టపడే గుణం ఉన్నదని అన్నారు. అలాగే ఇదే వేదిక‌పై 64వ జాతీయ అవార్డుల‌ను ప్ర‌ధానం చేశారు. రుస్తుం`లో నౌకాదళ అధికారిగా నటించిన అక్షయ్‌కుమార్‌కు ఉత్తమ నటుడి అవార్డు, మలయాళ చిత్రం మిన్నామినుంగు`లో నటించిన సురభికి ఉత్తమ నటి అవార్డు కింద రజత కమలం, రూ.50వేల చొప్పున నగదు అందజేశారు. 1896నాటి హైజాక్ ఘటన ఆధారంగా రాంమధ్వాని దర్శకత్వంలో రూపొందిన నీరజ` ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు అందుకోగా, అందులో నటించిన సోనంకపూర్‌కు ప్రత్యేక అవార్డు లభించింది. తెలుగులో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా శతమానం భవతి`, ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్ళిచూపులు` అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ మాటల రచయితగా తరుణ్‌భాస్కర్ (పెళ్ళిచూపులు), ఉత్తమ కొరియోక్షిగాఫర్‌గా రాజు సుందరం (జనతాగ్యారేజ్)తోపాటు మోహన్‌లాల్ (జనతాగ్యారేజ్)కు ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.