close
Choose your channels

పాతికేళ్ళ తర్వాత కమల్ తో అమల...

Tuesday, November 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చీకటిరాజ్యం నవంబర్ 20న విడుదలకు సిద్ధమైంది. తమిళంలో మాత్రం సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10నే విడుదల అవుతుంది. యాక్షన్స థ్రిల్లర్ గా విడుదలకు సిద్ధమవుతున్న కమల్ అప్పుడే తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రంలో కమల్ సరసన అక్కినేని అమల నటిస్తున్నారు. అమలతో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుంది.

గతంలో గురు(తమిళంలో సత్య), వెట్రి విళ, పెసుమ్ పడమ్(తెలుగులో పుష్పక విమానం) చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. దాదాపు పాతికేళ్ళ తర్వాత కమల్ మరోసారి అమలతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం జనవరి నుండి ప్రారంభం కానుంది. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వీరి కాంబినేషన్ లో పాతికేళ్ళ క్రితం చాణక్యన్ అనే సినిమా రూపొందింది. ఏదైతేనేం ఇటు హీరోయిన్, అటు దర్శకుడు ఇద్దరితో పాతికేళ్ళ తర్వాత కమల్ కలిసి నటించబోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.