close
Choose your channels

కాష్మోరా ట్రైల‌ర్ అదిరింది..!

Friday, October 7, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ హీరో కార్తీ, న‌య‌న‌తార‌, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీపావళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న కాష్మోరా ట్రైల‌ర్ ను ఈ రోజు రిలీజ్ చేసారు.

ఈ ట్రైల‌ర్ లో కార్తీ సైనికాధికారి గెట‌ప్ & మాస్ గెట‌ప్ లో క‌నిపించాడు. ఇక అందాల తార న‌య‌న‌తార ర‌త్న‌మ‌హాదేవి పాత్ర‌లో క‌నిపిస్తే...శ్రీదివ్య చేత‌బ‌డుల‌కు సంబంధించిన పుస్త‌కాన్ని చ‌దువుతూ త‌న గ‌త చిత్రాల‌కు భిన్నంగా క‌నిపించింది. యుద్దాలు - సైనిక వ్యూహాలు - సెట్టింగులు చూస్తుంటే ప్ర‌తి ఫ్రేమ్ లో భారీత‌నం క‌నిపిస్తుంది. ఈ ట్రైల‌ర్ కాష్మోరా పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి...దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న కాష్మోరా సినిమా ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించ‌నుందో చూడాలి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.