close
Choose your channels

'చెలియా' వంటి ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ చేయడం పెద్ద ఛాలెంజ్ - కార్తీ

Monday, April 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కార్తీ, అదితిరావు హైద‌రీ జంట‌గా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై మద్రాస్‌ టాకీస్‌ రూపొందించిన చిత్రం 'చెలియా'. ఏప్రిల్‌ 7న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా హీరో కార్తీతో ఇంటర్వ్యూ....
`చెలియా` మూవీ ఎలా స్టార్ట‌య్యింది...?
నా కెరీర్‌ మణిరత్నంసార్‌ దగ్గరే స్టార్టయ్యింది. ఆయన దగ్గర రెండేళ్ళ పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. నటుడుగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి పదేళ్ళు అయ్యింది. ఓ న‌టుడుగా 'చెలియా' సినిమా నాకెంతో స్పెషల్‌ మూవీ. గత ఏడాది మణిరత్నంగారు నాతో..ఓ స్క్రిప్ట్‌ ఉంది సినిమా చేద్దామా అని అన్నారు. దానికి నేను సార్‌..మీరు డిసైడ్‌ చేయండి..నేను కాదు అని ఆయనతో అన్నాను. క‌థ చెప్పారు. నాకు న‌చ్చింది. సినిమా అలా ప్రారంభం అయ్యింది.
`చెలియా`లో క్యారెక్ట‌ర్‌ గురించి చెప్పండి?
ఫైటర్‌ ఫైలట్‌, ఒక డాక్టర్‌ మధ్య జరిగే ఓ లవ్‌స్టోరీ. శ్రీనగర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే ఓ లవ్‌స్టోరీ ఇది. స్క్రిప్ట్‌ చదివిన త‌ర్వాత నాకు సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ సినిమా గుర్తుకు వ‌చ్చింది. సాధారణంగా అన్నయ్యకు ఇలాంటి రోల్స్‌ వస్తుంటాయి కదా..నాకు కొత్తగా ఉంటుందని తెలిసింది. నేను షాక్‌ అయ్యాను కారణం. నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్‌కు ఇది డిఫరెంట్‌ క్యారెక్టర్‌. మణిరత్నంగారిని అడిగితే పూర్తిగా క్యారెక్టర్‌ ఉండేలా మారవచ్చు అని నాకు ఆయన ఆత్మవిశ్వాస్వాన్ని ఇచ్చారు. సినిమాలో నా క్యారెక్టర్‌ కోసం ఫైటర్‌ ఫైలట్స్‌తో ట్రయినింగ్‌ తీసుకున్నాను. వారితో రెండు రోజుల పాటు అక్కడే ఉండి మాట్లాడి విషయాలు తెలుసుకున్నాను. చెలియా సినిమాలో ఫైటర్‌ ఫైలట్‌ రోల్‌ను చేయవచ్చుననే నమ్మకం నాలో ఏర్పడింది.
సినిమా క‌థేంటి?
`చెలియా` రెండు స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ మధ్య సాగే లవ్‌స్టోరీ. ఫైటర్‌ఫైలైట్‌ అంటే ప్రతిరోజూ ప్రమాదమే. ట్రయినింగ్‌ వెళ్ళినా, యుద్ధానికి వెళ్ళినా ఏదైనా ప్రమాదమే. అటువంటి ఫైటర్‌ ఫైలైట్‌కు డాక్టర్‌ కోర్సు పూర్తి చేసుకుని శ్రీనగర్‌లో ఉద్యోగం చేయడానికి వచ్చిన ఓ లేడీ డాక్టర్‌కు మధ్య జరిగే ప్రేమకథ. కంప్లీట్‌ రిలేషన్‌ షిప్‌ బేస్‌డ్‌ మూవీ. 'ఓకే బంగారం' కూడా రెండు క్యారెక్టర్స్‌ మధ్య జరిగే ప్రేమకథే. 'ఓకే బంగారం' లైట్‌ వెయిట్‌ లవ్‌స్టోరీ అయితే 'చెలియా'ఇంటెన్స్‌ ఎమోషనల్‌ లవ్‌స్టోరీ. మొత్తంగా 'చెలియా' కాస్లిక్‌ లవ్‌స్టోరీ.
శ్రీన‌గ‌ర్‌లో షూటింగ్ చేశారు క‌దా..ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశారు?
షూటింగ్‌ ఎక్కువ భాగం శ్రీనగర్‌లో జరిగింది. అక్కడ ఉష్ణోగ్రతలు -4 నుండి -15 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య చిత్రీకరణ జరిపాం. మణిరత్నంగారు చాలా వేగంగా చిత్రీకరిస్తారు. ఒకరోజులో మూడు, నాలుగు సీన్స్‌ను షూట్‌ చేస్తారు. సినిమా షూటింగ్‌ 50-60 రోజుల్లో పూర్తయ్యింది. కానీ సినిమా ప్రిపరేషన్‌కు 4-5 సమయం తీసుకున్నాం. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుండి హీరోగా మారిన తర్వాత మణిసార్‌తో చేసిన తొలి సినిమా ఇది. ఇప్పుడు ఓ సీన్‌ గురించి ఆయనతో బాగా డిస్కస్‌ చేసే అవకాశం కలుగుతుంది. పెర్‌ఫార్మెన్స్‌ గురించి అడిగి తెలుసుకున్నాను. ఆయన కూడా కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు చేశారు.
మ‌ణిగారి వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసిన మీకు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం ఎమైనా ఇబ్బందిగా అనిపించిందా?
మణిర‌త్నంగారు అంద‌రికీ సార్ అవుతేరేమో కానీ నాకు గురువుగారు..ఆయ‌న‌తో వర్క్‌ చేయడం ఇబ్బంది అనుకోవడం కంటే ఛాలెంజింగ్‌గా అనుకోవచ్చు. ఫైటర్‌ ఫైలట్‌, డాక్టర్‌ మధ్య సీన్స్‌ను రాయడం కష్టం, నటించడం కూడా కష్టం. చాలా క్టిష్టమైన క్యారెక్టర్‌ కాబట్టి అర్థం చేసుకోవడానికి ముందు కష్టమయ్యింది. కానీ పెర్‌ఫార్మ్‌ చేయడానికి చాలా ఆసక్తిగా అనిపించింది.
కొత్త కాన్సెప్ట్‌ల‌ను ఎంచుకోవ‌డంలో ప్రెష‌ర్ ఫీల‌వుతారా ?
నేను ముందు సినిమాకు పెద్ద అభిమానిని. ఒక సినిమాను ఫ్యాన్‌లా చూడాలని అనుకుంటాను. అందుకే కథ వినేటప్పుడు ముందు నాకు నచ్చాలని అనుకుంటాను. ఒక నటుడుగా నేను కొత్తగా ఏం చేయబోతున్నాను. కొత్తగా ఏం నేర్చుకుంటానోనని ఆలోచిస్తాను. కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ అనేది ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కాష్మోరా సినిమా కోసం గుర్రపుస్వారీ, కత్తియుద్ధం నేర్చుకున్నాను. చెలియా సినిమా కోసం ఫైలైట్‌ ట్రయినింగ్‌ తీసుకున్నాను. ఇలా ప్రతిసారి ఏదో ఒకటి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలనుకుంటాను. ప్రెష‌ర్ ఫీల్ కాను.
`చెలియా` క‌థ విన‌గానే మీకెమ‌నిపించింది?
కథ వినగానే నాకు గుర్తుకు వచ్చింది. 'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌' సినిమానే గుర్తుకు వచ్చింది. అందులో మేజర్‌ సూర్యలాంటి ఒక లుక్‌ కావాలని నాకు అర్థం అయ్యింది. అందుకోసం నేను చేంజ్‌ కావాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం రెగ్యులర్‌గా వర్కవుట్స్‌ చేశాను. చాలా రోజుల లిక్విడ్‌ డైట్‌ తీసుకున్నాను.
రెహ‌మాన్ మ్యూజిక్ గురించి.?
ఎ.ఆర్‌.రెహమాన్‌గారు తొంబై దశకంలోని క్లాసిక్‌ మ్యూజిక్‌ను చెలియా సినిమాకు ఇచ్చారు. పాటలు వింటుంటే రోజా సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలిగింది.
హీరోగా పదేళ్ళ జ‌ర్నీ ఎలా ఉంది?
నటుడుగా పదేళ్ళు జీవితాన్ని పూర్తి చేసుకోవడం అనేది అదృష్టమనే చెప్పాలి. మనం ఎదిగే క్రమంలో అమ్మ నాన్న, పెద్దవాళ్ళ మాట వింటాం. తర్వాత మనకంటూ ఓ డ్రీమ్‌ ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను ఇంజనీరింగ్‌ చదివిన తర్వాత సినిమాల్లో రావడానికి ఇంట్లో అడిగితే నాన్నగారు..ఇంజనీరింగ్‌ చదువుకున్నావ్‌ కదా..నీకేంట్రా సినిమాల్లోకి వస్తానంటున్నావ్‌ అన్నారు. కానీ సినిమాల్లోకి రావాలనుకునే కోరికతో నా ఉద్యోగాన్ని వదిలేసి రిస్క్‌ చేశాను. పాతికేళ్ళ వయసులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను. తర్వాత హీరోగా మారాను. ఈ పదేళ్ళ జర్నీని ఓసారి వెనుదిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన కలలను పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయాణం చాలా ముఖ్యమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.