close
Choose your channels

'కాటమరాయుడు' టీజర్ రివ్యూ...

Saturday, February 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు`. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. 'గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత పవన్ కల్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈరోజు విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్ చూస్తుంటే క‌నుల విందుగా ఉంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచె క‌ట్టు లుక్‌, స్ట‌యిలిష్ లుక్‌తో చాలా బాగా ఉన్నాడు. ప్ర‌సాద్ మూరెళ్ళ కెమెరా వ‌ర్క్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. ఇక అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూప‌ర్బ్ అనేలా ఉంది. ఎంత మంది ఉన్నార‌నేది ముఖ్యం కాదు..ఎవ‌డున్నాడ‌నేదే ముఖ్యం అంటూ ప‌వ‌న్ చెప్పిన డైలాగ్ అదుర్స్‌..ఇటు ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా టీజ‌ర్ ఉంది. డిజిట‌ల్ మీడియాలో కొత్త రికార్డుల‌కు కాట‌మ‌రాయుడు తెర తీయ‌నున్నాడ‌నేది తెలుస్తుంది. సినిమాను ఉగాది సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.