close
Choose your channels

యంగ్ హీరోతో కీర్తి సురేష్...?

Friday, March 3, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా సినిమా రూపొందుతోంది. ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్నల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ను న‌టింప చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికార‌క స‌మాచారం రానుంద‌ని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.