close
Choose your channels

జూలై 26న 'కేటుగాడు' ఆడియో రిలీజ్

Thursday, July 23, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉలవచారు బిర్యాని` ద్వారా హీరోగా పరిచయమైన తేజస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'. నూతన దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చాందినీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత వీఎస్‌పీ తెన్నేటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని '100 క్రోర్స్ అకాడమీ'తో కలిసి వెంకటేష్ మూవీస్ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్ బాలసాని నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలను జూలై 26న హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా..

నిర్మాత వెంకటేష్ బాలసాని మాట్లాడుతూ `వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా, క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందించాం. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించారు. ఆడియో కార్యక్రమాన్ని జూలై 26న నిర్వహిస్తున్నాం. తేజస్ ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ లుక్ తో కనపడతాడు. ఆగస్ట్ లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం`` అన్నారు.

ముఖ్య నటీనట వర్గం: సుమన్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సప్తగిరి, స్నిగ్ధ, భావన, ప్రవీణ్‌, చంద్రశేఖర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌,అదుర్స్‌రఘు,సత్యతదితరులు ఇతర తారాగణం ఈ చిత్రానికి సాంకేతిక వర్గం: మాటలు: పి.రాజశేఖర్‌రెడ్డి, భాషాశ్రీ, పాటలు: శ్రీమణి,కాసర్ల శ్యామ్‌,భాషాశ్రీ, బాలాజీ బి.సుబ్బరాయశర్మ, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటర్‌: పి.వెంకటేశ్వర్రావు, ఫైట్‌ మాస్టర్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు.యం, సంపత్‌కుమార్‌.ఎ, సమర్పణ: వి.యస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బాలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టూ నల్లూరి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.