close
Choose your channels

'కేటుగాడు'కి డేట్ సిద్ధమైంది...

Wednesday, July 8, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉలవచారు బిర్యాని` ద్వారా హీరోగా పరిచయమైన తేజస్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'. నూతన దర్శకుడు కిట్టు నల్లూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో చాందినీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత వీఎస్‌పీ తెన్నేటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని '100 క్రోర్స్ అకాడమీ'తో కలిసి వెంకటేష్ మూవీస్ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్ బలసాని నిర్మించారు. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో జూలై 16న విడుదల కానుంది. అలాగే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై 24న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సుమన్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సప్తగిరి, స్నిగ్ధ, భావన, ప్రవీణ్‌, చంద్రశేఖర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, అదుర్స్‌ రఘు,సత్య తదితరులు ఇతర తారాణగణం. ఈ చిత్రానికి మాటలు: పి.రాజశేఖర్‌రెడ్డి, భాషాశ్రీ, పాటలు: శ్రీమణి,కాసర్ల శ్యామ్‌,భాషాశ్రీ, బాలాజీ బి.సుబ్బరాయశర్మ, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటర్‌: పి.వెంకటేశ్వర్రావు, ఫైట్‌ మాస్టర్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు.యం, సంపత్‌కుమార్‌.ఎ, సమర్పణ: వి.యస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టూ నల్లూరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.