close
Choose your channels

చరణ్ గురించిన ఈ సీక్రెట్ తెలుసా మీకు

Monday, July 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరంజీవి త‌న‌యుడిగా తెరంగేట్రం చేసిన రామ్ చ‌ర‌ణ్‌ను చూసి చాలా మంది గోల్డెన్ స్పూన్ ప‌ర్స‌న్ అని అనుకుంటారు. కానీ చ‌ర‌ణ్ సినిమాల్లోకి రావ‌డానికి ముందు చాలా క‌ష్ట‌ప‌డ్డాడట‌. ఎనిమిదేళ్ల పాటు శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నాడ‌ట‌. ఈ విషయం బ‌య‌ట చాలా మందికి తెలియ‌దు. కానీ ఈ విష‌యాన్ని సుక్కు అంద‌రికీ చెప్పేశాడు. రీసెంట్‌గా సుకుమార్ నిర్మాత‌గా చేసిన సినిమా `ద‌ర్శ‌కుడు`.

ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కి చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా హాజరై యూనిట్‌ను అభినందించాడు. ఈ సంద‌ర్భంలో సుకుమార్, చ‌ర‌ణ్ సంగీతం నేర్చుకున్న విష‌యాన్ని అభిమానుల‌కు, ప్రేక్ష‌కులకు చెప్పాడు. చ‌ర‌ణ్, చిరంజీవి కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, మ‌ట్టి మ‌నిషి అని, చాలా నేచుర‌ల్‌గా ఉంటాడని కూడా సుకుమార్ తెలిపాడు. రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో `రంగ‌స్థ‌లం1985` సినిమా తెర‌కెక్కుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.