close
Choose your channels

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్ డేట్

Monday, January 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నమో వెంకటేశ`, దూకుడు`, 1 నేనొక్కడినే`, లెజెండ్`, పవర్`(కన్నడం), ఆగడు`, వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం7గా యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ`. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 18న విడుదల చేయనున్నారట. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

అందాల రాక్షసి వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి తెరకెక్కుతోంది. సినిమాను కూడా ఫ్రిభ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.