close
Choose your channels

నరుడా డోనరుడా థియేట్రికల్ ట్రైలర్ ను లాంఛ్ చేసిన మహేష్ బాబు..!

Tuesday, September 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రం ద్వారా ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్ గా, మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో విజ‌యం సాధించిన విక్కీడోన‌ర్ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవ‌ల కింగ్ నాగార్జున న‌రుడా డోన‌రుడా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.
ఇక థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసి మై డియ‌ర్ ఫ్రెండ్ సుమంత్ & టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ స్పందించారు. ఈ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే...అన్ని దానాల క‌న్నా గొప్ప దానం వీర్య‌దానం. మీ వీర్యాన్ని వీర‌త్వాన్ని వృదా చేయ‌కండి అంటూ త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పే డైలాగ్ తో ఈ ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి డాక్ట‌ర్ గా న‌టించారు. సుమంత్ ఎప్ప‌టిలాగే రియ‌లిస్టిక్ గా న‌టించిన‌ట్టు అనిపిస్తుంది. అలాగే చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో వ‌స్తున్న న‌రుడా నోన‌రుడా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డం ఖాయం అనిపిస్తుంది. స‌రైన స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్ కి ఈ సినిమా స‌క్సెస్ ఇస్తుంది అని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు న‌రుడా డోన‌రుడా టీమ్..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.